Mundu Mata - Pustaka Samkalanam Parichayam

                                                      పుస్తక సంకలనం  పరిచయం

ముందుగా  వానమామలై వారి పుస్తకాలను అనర్ఘ  రత్నాల ను  శీర్షికన  చూడవచ్చు.

ఈ పుస్తక సంకలనం లో ఆచార్యుల వారి  'జీవిత విశేషాలు' మొదట  ప్రస్తావించడమైనది. దానికి  సంబందించిన  అంశాలను  డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యు లు గారి వానమామలై శతపద్య  పారిజాతాలు గ్రంథం  నుంచి   గ్రహించబడింది . వానమామలై వంశము , బాల్యం , విద్యాభ్యాసం  మరియు సాహితీ  ప్రస్థానం  డాక్టర్  అందే  వెంకట రాజం  గారి 'వానమామలై  వరదా చార్యుల వారి   కృతులు - అనుశీలనము'  నుంచి   గ్రహించబడింది.


రెండవ  అధ్యాయం  'సాహితీ  పరిచయం ' లో ఆచార్యుల వారి సాహిత్యం   సంబందించిన   పుస్తకాలను మనకు పరిచయం చేయడమైనది . దానికి  సంబందించిన  అంశాలను డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యు లు గారి వానమామలై శతపద్య  పారిజాతాలు గ్రంథం  నుంచి   గ్రహించబడింది. .

వానమామలై  వారి పుస్తక పీఠికలను  'సాహిత్య  విశ్లేషణ'  గ  మూడవ  అధ్యాయం మీ ముందు ఉంచడమైనది.

నాల్గవ  అధ్యాయం  'సాహితీ  పరిమళాలు ' లో  ఆచార్యుల  వారి సాహిత్య  మధురిమలు కొన్నిటిని  మీ ముందుంచే  ప్రయత్నము చేయడమైనది   .  వారి  కవితలు  ఇందులో  చూడవచ్చు .

వరదా చార్యుల వారి  సాహిత్యం  ఆధారంగా  ప్రచురితమైన  కొన్ని  వ్యాసాలను  మీ ముందు కు  తెచ్చినదే   అయిదవ  అధ్యాయం   'సాహితీ  ఆధారిత  వ్యాసాలు '. ఆచార్యుల  వారి కవితల  ఆధారంగా  తెలుగు వెలుగు  పత్రికలో  ప్రచురితమైన శైలేష్ నిమ్మగడ్డ  గారి వ్యాసం 'అమరుడవు  నీ ఓయీ గాంధీ !  '   ఇందులో  ప్రస్తావించడమైనది.

ఆచార్యుల వారి  కవిత్వం , కవితల  ఫై  'అభిప్రాయాలు '  గ  ఆరవ  అధ్యాయం మీ ముందుకు తేవడమైనది. 


'స్మృతి  పథం '  శీర్షికన  ఏడవ   అధ్యాయం  లో  ఆచార్యుల వారి  శతజయంతి  ఉత్సవాల  నిర్వహణ,  వారి జీవిత విశేషాల  దృశ్య  మాలిక , వారి దస్తూరి  , కవితా  పఠనం మరియు ఇతర  వివరాలను పొందు పరచడమైనది.

తదుపరి  'ప్రస్తావనలు'  శీర్షికన  ఈ పుస్తక  సంకలనం లో  పొందుపరచిన అంశాలకు  సంబంధించిన  పుస్తకాలు , రచయితల   వివరాలు ఇవ్వడమైనది .

చివరగా  వానమామలై వారి  స్మారక విగ్రహం  సంబందించిన   వివరాలు , వారి జీవన రేఖలు క్లుప్తముగా  మీ ముందుంచడమైనది.







Popular posts from this blog