Kavitalu - Aanimutyalu

                                                         కవితలు - ఆణిముత్యాలు

 

ఓరుగల్లు  ఔన్నత్యం

ఓరుగల్ కోటలో నొకగంట నిలిచిన
         నాంధ్రుల  పౌరుషం  బర్థమగును
ఓరుగల్  సరసి నీరొకనాడు  ద్రావిన
        యబల  రుద్రమదేవి  యన  నెఱుంగు
ఓరుగల్  శిల్పమ్ము  నొకమారు  గాంచినఁ
        దెలుఁ గుల  ప్రతిభలు తెలిసివచ్చు
 ఓరుగల్  వాయువులొ క  తే ప  పీల్చిన
        నాం ద్రుల స్వేచ్చా వాంఛలవగతమగు


 ఓరుగల్  పేరోద  నొక్క  తడవ
దలంపఁ జా ల్  తెల్గు , చరితోన్నతుల  నెఱుంగ
ఓరుగల్  గడ్డనున్నట్టి  యొకొక  శిలను
బిలిచిన నొ హౌ  యనుచుఁ బల్కు దెలుగు వెలుగు

                                                                                    - పోతన చరిత్రము  9-78

                                                                                    అభినవ పోతన  వానమామలై



 మతం 

మత లక్ష్యము    పరసౌఖ్యము , మానవతయె  తద్భోగ్యము
జనతా జనార్దనుని  పూజనమే  ఇహపర  భాగ్యము

అందరిలో  దేవుడు గలడనుటే  సన్మతసారము
హిందువు ముస్లిము వేరను టిది  సైతాను విచారము

మతము పేరు జెప్పుకొనుచు  మడిగట్టుకొనగనేల
కులము వేరె  యనుచు అడ్డుగోడల  నిడుకొననేల
ఒకరికొకరు  పరులమనుచు  యుద్దములో  కూల్చుకొనిన
హారములో  చిట్టచివర   దారము  మిగులును  బేల.

మతము నేర్పునది  అహింస  మతమునేర్పు  విశ్వప్రేమ
మతము స్వార్ధమెడలగొట్టు  మాట మాత్మను  చక్కపెట్టు
మదము నేర్పునది  హింస  మదము నేర్పు విద్వేషము
మాకు తెలియకడిగెదము  మతమా  మదమా  వీరిది

పరుడెవ్వడు  లేడనుటయే  పరాత్పరుని  గుర్తించుట
సరిమానవు  ప్రేమించుటె  స్వర్గములో  వర్తించుట
అన్యత  భోదించేవారంతా  మోసం  గురువులు
ఐక్యత  చేదించేవారందరు  భూమకె  బరువులు

                                                                                    - జయధ్వజం , విప్రలబ్ద

                                                                                    అభినవ పోతన  వానమామలై



ఎవరు  కవి?

నేను కవిని  కవిత్వం  వ్రాస్తాను
నేను భువిని  అన్నింటినీ  నా  లోపలే   సృష్టిస్తాను
నేను రవిని  ఆర్పరాని  అగ్నినై  చూస్తాను
నేను  రవిచ్చవిని  లోకపు కాను దమ్ముల  వికసింప జేస్తాను
నా తమ్ముల కన్నుల వికసింప  జేస్తాను
నేను సురగవిని  సుధా  రసాల  వర్షిస్తాను
నేను దీవిని  నా ప్రపంచాన్నే  అక్షరం , అమరం  చేస్తాను

నేను  పవిని  ఉరుముతాను  జాగాలు విన
మెరుస్తాను  జనాలు తమ మార్గాలు  కన
నేను హంసను  పరమహంసను
దౌర్జన్యంపై  దాడి  వెడలిన  అహింసను
నేను మానస సరోవరంలో  విహరిస్తాను
అన్ని రసాల్లో  మునిగి అంటకుండా  ఈవలికి వస్తాను
పాలు  నీరు  వేరు చేసి  చూపిస్తాను


నేను  చల్లని  తెల్లని  రూపంలో  ఉన్న మీ శాంతిని
నేను మానవునిలో  మాధవుని  దర్శించే   వేదాంతిని
నేను  సంగీత  గంగారస  తరంగిణిలో  క్రీడించినపుడు
గేయాల  తరగలఫై  ఉయ్యాల   లుప్తాను
నేను  కాలాకాశంలో  మీరు   ఉడ్డీనం  చేసినపుడు
అవధులు  దాటి  అనంత  పథాలో  విహరిస్తాను
వచన  కవితలా  కనిపిస్తాను
నేను  త్రిపథ  గామిని ,  విశ్వప్రేమిని

నాకు  చాదస్తాలు  గిట్టవు , అవి   ప్రగతి పేరు  పెట్టుకున్నా  పట్టవు
నేను పడ్డే రూపంలో  ఉన్న మీ అద్దాన్ని
నాలో  చూచి  మిమ్ము మీరు  దిద్దుకొనే  పారిశుద్ద్యా న్ని
నా వైపు  చూస్తే  మీరు  నేనై   హసిస్తాను, విలపిస్తాను
మీరే  నేనై   నేనే  మీరై  వ్యవహరిస్తాను
మంచికి  పోసిన  ప్రాణం  నాకు  సన్మానం
నేను  శుద్ధుడను  నేను బుద్ధుడను
ప్రక్రుతి రామణీయక   బద్ధుడను
మమత  నా జన్మస్థానం , సమత  నా విద్యా విఙ్ఞానం
ఈ రెంటిలోని  ఆనందానుభూతియే   నా ప్రగతి  సోపానం


నాలోనేను , విశ్వంలో నేను , అందరు నాలో , నేనందరిలో
నేను  భయరహిత  అద్వైతాన్ని , నేను నవరూప  చైతన్యా న్ని
నా పేరు  నేను, నేను  విశ్వరూపాన్ని ,  ద్వైతంపై  గల  కోపాన్ని
నేను కవిని   నా  గేయం  అహింసా  క్రాంతి , నా  ధ్యేయం   విశ్వశాంతి


                                                                                       - కూలి పోయే  కొమ్మ

                                                                                    అభినవ పోతన  వానమామలై











                                      



       

Popular posts from this blog