Smruthi Patham Abhinandaniyam
స్మృతి పథం - అభినందనీయం
గౌరవనీయులు రమణాచారి గారి పర్యవేక్షణలో వానమామలై వారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆచార్యుల వారి మిత్రులు , సన్నిహితులు , శిష్యులు వీరందరి అద్వర్యం లో శతజయంతి ఉత్సవ సభలు విజయ వంతమైనవి. వానమామలై వారి జీవిత చరిత్ర విశేషాలను వారి సాహిత్యాన్ని మననం చేసే సువర్ణ అవకాశాన్ని శతజయంతి ఉత్సవ సభల ద్వారా మన అందరికి అందచేసిన శతజయంతి ఉత్సవ సమితి సభ్యులందరి కి కృతజ్ఞతలు. ఆచార్యుల వారి ఙ్గపకాలను పదిలంగా మన అందరికి 'శతవసంత సౌరభాలు ' సంచికలో అందించిన సంచిక ప్రధాన సంపాదకులు ఆచార్య రావికంటి వసునందన్ గారు అభినందనీయులు.
గౌరవనీయులు డాక్టర్ తిరుమల శ్రీనివాస చార్యుల గారు వానమామలై వారి పుస్తకాల లోని అంశాలను విడమర్చి అందరికి అర్థమగునట్లు తాత్పర్య సహితము గ 'శతపద్య పారిజాతాలు ' గ్రంధం ప్రచురించారు. వానమామలై వారి జయంతి ఉత్సవ సభ లలో పాల్గొని ఆచార్యుల వారి జీవిత విశేషములను , వారి సాహిత్య మాధుర్యాన్ని చక్క గ మన అందరికి అందించారు. వారికి కృతజ్ఞతలు.
వైద్య వినాయకరావు గారి పర్యవేక్షణలో , కె నారాయణ రెడ్డి గారి కార్యాచరణ లో చెన్నూర్ నందు ఆచార్యుల వారి స్మారక విగ్రహము ప్రతిష్టించబడుట ముదావహం.శతజయంతి ఉత్సవాలలో భాగముగా చెన్నూర్ పట్టణము నందు ఉదయం చర్చాగోష్టి , ఆచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ , జగన్నాథాలయం వద్ద వానమామలై వారి జీవిత విశేషాల , ప్రశంసా పత్రాల , సన్మాన పత్రాల , పురస్కారాల ప్రదర్శన , సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో గీత రామాయణం, భోగిని లాస్యం గానము , మరియు ఇతర అంశాలు సభలో పాల్గొన్నవారిని ఎంతో గాను ఆకట్టుకొన్నాయి
నంది అవార్డు గ్రహీత డి సురేష్ కుమార్ గారు ఆచార్యుల వారి యందు వాత్సల్యం చే ప్రతి నంవత్సరం వానమామలై వరద చార్యుల వారి జయంతి ఉత్సవాలను క్రమం తప్పకుండ స్వీయ అధ్వర్యంలో హైదరాబాద్ లో ఘనము గ నిర్వహించు చున్నారు. ఈ సందర్భము గ వానమామలై వారి స్మారక పురస్కారాన్ని (అభినవపోతన వానమామలై జీవిత సాఫల్య పురస్కారం ) కూడా ప్రతి ఏటా అంద చేయు చున్నారు. సురేష్ కుమార్ గారు అభినందనీయులు.
డి సురేష్ కుమార్ గారి దర్శకత్వం లో నిర్మించిన వానమామలై వారి డాక్యుమెంటరీ చిత్రం లింకు క్రింద ఈయబడినది.
వానమామలై డాక్యుమెంటరీ చిత్రం
మహాకావ్యం పోతనచరిత్రం పునర్ము ద్రణ వెంకటేశ్వర స్వామి వారి కృప తో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గావించారు. ఈ అమూల్య గ్రంథాన్ని మనకు మరల అందుబాటులోకి తెచ్చి ప్రసాదించిన వారు అభినందనీయులు. "స్తవ రాజ పంచశతి" , "సూక్తి వైజయంతి " పుస్తక ముద్రణకు దేవస్థానం వారు అందించిన సహకారము ఆనందదాయకం.
యువ భారతి వారు భోగినీలాస్యము పునర్ముద్రణ గావించుట అభినందనీయం.
ఆచార్యుల వారి శిష్యులు పుస్తక శిల్పి తాళ్లపల్లి మురళీధరగౌడ్ గారి నేతృత్వంలో వానమామలై వారి అముద్రిత పుస్తకాలూ ఎన్నో ముద్రితం గావింపబడ్డాయి. ఆచార్యుల వారి ముద్రిత పుస్తకాలూ కూడా మరి కొన్ని కాపీలు పునర్ము ద్రణ గావింపబడ్డాయి. పుస్తక ముద్రణ ద్వారా వానమామలై వారి సాహిత్యన్ని అందరికి అంద చేసిన మురళీధరగౌడ్ గారు అభినందనీయులు.
రాష్ట్ర గ్రంథాలయాల శాఖ ఆధ్వర్యంలో వామామలై వారి ప్రచురణలు రాష్ట్రములోని అన్ని గ్రంధాలయాల శాఖలకు పంపిణి చేయుటకై అందచేయబడినవి.
ఆచార్యుల వారి శిష్యులు కొండల రావు గారు ఆచార్యుల వారి సాహిత్యాన్ని ఫెయిర్ (డ్రాఫ్ట్ నుండి ఫెయిర్ చేయుట ,ముద్రితము నకు ముందు ) చేయు ప్రక్రియ లో సహకరించి అభినందనీయు లయ్యారు. అండ్ వెంకట రాజం గారు పోతన చరిత్రము గ్రంథాన్ని ఫెయిర్ చేయు ప్రక్రియ లో సహకారం అందించారు.
కొండపల్లి శేషగిరి రావు గారు 'కూలి పోయే కోమ్మ' పుస్తకము ముఖచిత్రము తో మెరుగులు దిద్దారు. మడి పడగ బలరామాచార్య , ఆచార్యుల వారి ఎన్నో పుస్తకములకు ముఖచిత్రం, మరియు ఇతర చిత్రాలతో అలరించారు. పబ్బా శంకరయ్య గారు తమ శ్రీరామ పవర్ ప్రెస్ లో ఆచార్యు ల వారి పుస్తకాలను ముద్రణ గావించారు. ఆచార్యుల వారి సాహిత్యం మనకు అందచేసే ప్రక్రియలో వారందరు అభినందనీయులు .
వానమామలై వారి జీవిత చరిత్ర , సాహిత్యం ఫై పీహెడీ సిద్ధాంత గ్రంధాన్ని 'వానమామలై వరదా చార్యుల వారి కృతులు - అనుశీలనము ' అను పేర వారి శిష్యులు అందే వెంకట రాజం (కోరుట్ల ) గారు ప్రచురించి అభినందనీయులయ్యారు. అందే రాజేందర్ గారు కోరుట్ల లో ప్రతి సంవత్సరం ఆచార్యులవారి జయంతి ఉత్సవాలు జరుపుతు వానమామలై వారి స్మారక పురస్కారాన్ని అందచేయుచున్నారు . వారు అభినందనీయులు.
ఆచార్య డాక్టర్ దేవరాజు రాం భావ్ గారు, కొండల రావు గారు , పాండురంగం గారు, మల్లా రెడ్డి గారు , కరుణాకర్ గారు, రామకృష్ణ గారు , క్రిష్ణ మూర్తి గారు, రంగయ్య మున్నగు వారు నాటకం , గొల్ల సుద్దులు , బుర్రకథ, పాటలు, ఏకపాత్రా భినయం మాద్యమం గ ఆచార్యుల వారి సాహిత్యాన్ని అందించి అభినందనీయు లయ్యారు.
దత్తాత్రేయ మాస్టారు గారు 'గీత రామాయణం' పుస్తకం మరాఠి నుండి తెలుగులోకి అనువదించు ప్రక్రియలో సహకరించి అభినందనీయు లయ్యారు.
ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి అద్వర్యం లో ఆచార్యు ల వారి గీత రామాయణం పాటలు డొండు శాస్త్రి గారు, ఛాయా దేవి గారు , బాల కృష్ణ ప్రసాద్ గారి గాత్రం లో రికార్డు చేయబడినవి.వేదవతి ప్రభాకర్ గారి గాత్రంలో మోహినీ భస్మాసుర నాటకం లో ని పాటలు రికార్డు చేయ బడినవి. ఆచార్యుల వారి సాహిత్యాన్ని పాటల రూపంలో అందించిన వారు అభినందనీయులు.
ఆచార్యుల వారి నాటకాలు మోహినీ భస్మాసుర , మహిషాసుర మర్దని చాల కాలం ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి లో ప్రసారం చేసి మనలను అలరించారు
శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం "అభినవ పోతన వానమామలై" ధారావాహికం ప్రసారము చేయుట ఆనందదాయకం.
ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు ఆచార్యుల వారి గీత రామాయణం పాటలు ప్రసారము చేయుటలో రాజారాం గారి కృషి అభినందనీయం.
శ్యామల గారు , జక్కిపల్లి నాగేశ్వర రావు గారు, రంగనాథ్ గారు తమ గాత్ర మాధుర్యం తో ఆచార్యుల వారి సాహిత్యం - గీత రామాయణం పాటలు మనకు అందచేశారు. చెక్కల శ్రీనివాస్ గారు ఆచార్యు ల వారి హనుమాన్ చాలీసా ( సంత్ తులసీదాస్ వారి దానికి తెలుగు అనువాదం) సీ డి రూపము గావించి అభినందనీయు లయ్యారు.
ఉమామహేశ్వర రావు గారు మంచిర్యాల లో ప్రతి సంవత్సరం ఆచార్యుల వారి జయంతి ఉత్సవాలను నిర్వహించు చున్నారు. వారు అభినందనీయులు.
ఆచార్యుల వారి ఉత్సవ సభలలో ఆచార్యుల వారిని ప్రస్తావిస్తూ సాగిన తుమ్మూరి రామమోహన్ గారి గేయం 'మాది ఆదిలాబాదు జిల్లా ' ఎంతో గాను అలరించేది.
ఆచార్యుల వారి జయంతి ఉత్సవ సభలలో తమ వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరించిన దక్షిణామూర్తి గారు అభినందనీయులు.
రాజా రెడ్డి దంపతులు ఆచార్యుల వారి కవితా పఠనం రికార్డు చేసి భద్రపరచడమైనది . వాటిని మనకు అందించినందుకు (ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నవి ) వారు అభినందనీయులు .
ఆచార్యుల వారి వద్ద నున్న అమూల్య పుస్తక సేకరణలోని కొన్ని పుస్తకములు చెన్నూర్ లో ని శిశు మందిర్ పాఠశాల గ్రంధాలయముకు అందించడమైనది .
మునుగోడు రాములు, పెంటయ్య , ఇందుమతి దంపతులు, ఉషా రావు , కొండలరావు మున్నగు శిష్యుల తో ఆచార్యుల వారి ఇల్లు ఎప్పుడు సందడి గా కనిపించేది.
ఆచార్యుల వారి సతీమణి వైదేహి గారు , వారి కుమారుడు రవీంద్రా చార్యుల వారు వానామాలై వారి తదనంతరం కూడా అమితమైన శ్రద్ధ తో ఎన్నో అముద్రిత రచనలను ముద్రితము గావించారు , ముద్రిత రచనల పునఃముద్రణ గావించి మనకు అందించిన వీరు ధన్యులు.